ఎక్స్‌ప్రెస్‌ హైవేకు ఆర్మీ భూములు

army-landకొత్త సెక్రేటరేట్  నిర్మాణంపై రోడ్లు భవనాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్లో ఉన్న బైసన్ ఫోలో గ్రౌండ్ లో సెక్రటేరియట్ కట్టాలనుకుంటున్న సర్కార్ …దీనిపై కేంద్ర రక్షణశాఖతో చర్చించింది. రక్షణ శాఖ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు అధికారులు. స్థలం విషయంలో స్పష్టమైన ప్రకటన వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందంటున్నారు.

పారడైజ్‌నుంచి షామీర్‌పేట దగ్గర ఉన్న ORR వరకూ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించనున్నారు. అలాగే పారడైస్‌ ఉంచి బోయిన్‌పల్లి వరకూ ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నారు. దీనికోసం రక్షణ శాఖ భూములను వినియోగించుకోనున్నారు. 100 ఎకరాలు ప్లస్ బైసన్ గ్రౌండ్ 60 ఎకరాలు.. మొత్తం 160 ఎకరాలకు ప్రతిగా వెయ్యి ఎకరాలు ఇవ్వాలని రక్షణ శాఖ కోరిందన్నారు అధికారులు. రక్షణశాఖ ఇచ్చే భూమి ప్రైమ్ ల్యాండ్  కాబట్టే ఎక్కువ అడుగుతున్నారని చెప్పారు. దీనికి రాష్ట్ర సర్కారు కూడా ఓకే చెప్పిందన్నారు. వెయ్యి ఎకరాలు వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లోఇవ్వనున్నట్లు కేంద్రానికి చెప్పామన్నారు. త్వరలోనే సెక్రటేరియట్ కు కావాల్సిన బైసన్ గ్రౌండ్ పై క్లారిటీ వస్తుందంటున్నారు అధికారులు. ఈ 60 ఎకరాల స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy