ఫైనల్స్ లో ముంబయి..!!

11267756_10152917495338634_5598554927722562805_nవరుస విక్టరీలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్ ఫైనల్ కు చేరింది. ఫస్ట్ క్వాలిపైయింగ్ మ్యాచ్ లో చెన్నైపై సూపర్ విక్టరీ కొట్టింది. ఆల్ రౌండ్ ఫర్పామెన్స్ తో కింగ్స్ పై 25 రన్స్ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్స్ సిమన్స్…పార్ధివ్ పటేల్ సూపర్ బ్యాటింగ్ తో చెన్నై బౌలింగ్ ను చితకొట్టారు. ఐదు సిక్స్ లు, మూడు ఫోర్లతో 65 రన్స్ చేసిన సిమన్స్ జేడాజా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. మరోవైపు పార్ధివ్ కూడా 35 రన్స్ చేశాడు. ఓపెనర్స్… సూపర్ ఓపెనింగ్ ఇచ్చినా…మిడిల్ ఆర్డర్ లో వచ్చిన వారు..స్కోర్ ను పరుగులు పెట్టించలేక పోయారు. మిరాకిల్ చేస్తారనుకున్న పాండ్యా, రోహిత్ శర్మ, రాయుడు…తొందరగానే పెవీలియన్ కు చేరారు. ఇక మిడిల్ ఆర్డర్ లో వచ్చిన పొలార్డ్ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపడంతో భారీ స్కోర్ చేసింది ముంబై.  ఐదు సిక్స్ లు, ఒక ఫోర్ తో 17 బంతుల్లోనే 41 రన్స్ చేశాడు.

dhoni-650_052015113313188 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నైకి  స్టార్టింగ్ లో స్ట్రాంగ్ దెబ్బ తగిలింది. మంచి ఓపెనింగ్ అందిస్తాడనుకున్న డ్వేన్ స్మిత్.. మలింగ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ మైక్ హస్సీ కూడా 16 పరుగులకే పెవీలియన్ చేరాడు. అయితే మిడిల్ ఆర్డర్ లో వచ్చిన డెప్లెసిస్…సురేష్ రైనా కాసేపు ఇన్నింగ్స్ ను దారిలో పెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. సాఫీగా సాగుతోందనుకున్న సమయంలో మళ్లీ చెన్నైకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. 25 పరుగుల స్కోర్ దగ్గర రైనా…హర్భజన్ సింగ్ బౌలింగ్ కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన ధోనీ అభిమానులను మరోసారి అప్ సెట్ చేశాడు. ఫస్ట్ బాల్ కే డకౌట్ అయ్యాడు. చివర్లో వచ్చిన బ్రేవో, నేగీ, రవీంద్ర జడేజా కూడా ఫెయిల్ కావడంతో 19 ఓవర్లలోనే 162 పరుగులు మాత్రమే చేసి ఓటమిని టేస్ట్ చేసింది చెన్నై. ముంబై బౌలర్లలో మలింగ మూడు వికెట్లు తీయగా.. హర్భజన్, వినయ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. సుచిత్, మెక్ లాగాహన్ కు తలో వికెట్ దొరికింది. బ్యాటింగ్ తో ఆకట్టుకున్న ముంబై బ్యాట్స్ మెన్ పొలార్డ్ కు మ్యాన్ ఆప్ ద మ్యాచ్ దక్కింది. మరో క్వాలిఫయర్ లో గెలిస్తే ఫైనల్ వెళ్లే అవకాశాలున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈనెల 22న ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో లక్ ను పరిశీలించుకోనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy