ఎనిమిదో తరగతే అర్హత : FCIలో భారీ ఉద్యోగాలు

Food_Corporation_of_India.svgహైదరాబాద్ లో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ లోని FCI కార్యాలయాల్లో 271 వాచ్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు.

మొత్తం వాచ్ మెన్ ఖాళీలు: 271 (అన్ రిజర్వుడ్..138, ఓబీసీ..73, ఎస్సీ..41, ఎస్టీ..19)

ప్రాంతాల వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్..158, తెలంగాణ..101, అండమాన్ నికోబార్..12

వేతనం: రూ.8,100-18,070

విద్యార్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి

వయోపరిమితి: 2017, జూలై నాటికి 18-25 ఏళ్ళ లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్..పీఈటీ( దేహ దారుఢ్య పరీక్ష)

దృష్టి సామర్థ్యం: అభ్యర్థులకు FCI నిబంధనలను అనుసరించి తగిన దృష్టి సామర్థ్యం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.250, ఎస్సీ/ఎస్టీలకు, మహిళ, దివ్యాంగ, ఎక్స్..సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 21, 2017

వెబ్ సైట్…www.fciregionaljobs.com

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy