ఎన్టీఆర్‌ క్లాప్‌ : కల్యాణ్‌రామ్‌ కొత్త చిత్రం షురూ

ntrనందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియోలో ఈ కార్యక్రమాన్ని ఆదివారం ( జూలై-30)  ఘనంగా షురూ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, హరికృష్ణ, క్రిష్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి షాట్‌కు ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘180’ చిత్ర దర్శకుడు జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ ప్రస్తుతం ‘ఎమ్మెల్యే’ చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy