ఎన్టీఆర్ ప్లేస్ లో కార్తీ?

karthi-19-08-09‘యుగానికొక్కడు’, ‘ఆవారా’ వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న తమిళ హీరో కార్తీ ఇప్పుడు ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీ లో యాక్ట్ చేయనున్నాడు. అది కూడా ఓ టాలీవుడ్ సీనియర్ హీరోతో మల్టీ స్టారర్ లో. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలు హీరోలుగా తీయాలనుకున్న మల్టీస్టారర్ మూవీలో యంగ్ టైగర్ ను కార్తీ రీప్లేస్ చేయనున్నాడని టాక్. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కార్తీ, నాగ్‌లు కలిసి నటించనున్నారని చెప్తున్నారు. పీవీపీ సినిమా బ్యానర్ పై ప్రసాద్ వి.పొట్లూరి ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమా నుంచి కొన్ని కారణాలవల్ల ఎన్టీఆర్ తప్పుకున్నారని, ఆ స్థానంలో కార్తీని తీసుకున్నారని సినిమా వర్గాల సమాచారం. గత కొంత కాలంగా తెలుగు సినిమా చేయాలని ఆలోచిస్తున్న కార్తీ, డైరెక్టర్ వంశీ పైడిపల్లి అడిగిన వెంటనే ఈ మూవీలో యాక్ట్ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కార్తీ తమిళంలో మద్రాస్, కొంబన్ మూవీల్లో యాక్ట్ చేస్తున్నాడు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy