
ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఇటీవలే గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభం అయ్యింది. మొదట మూవీకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తేజ తప్పుకున్నాడు. ఇటీవలే క్రిష్ జాయిన్ అయ్యాడు. ఎన్నికలకు ముందే.. ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ టైంలోనే.. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదంటూ నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించిన పాత్రల విషయమై నెగిటివ్‌గా చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మా పాత్రల గురించి ముందుగా చెప్పాలని.. అభ్యంతరకరంగా చిత్రీకరించొద్దని కోరారు. ముందుగా కథ చెప్పాలని కోరారు.