ఎన్డీఏ బడ్జెట్ కొత్తగా లేదు..

images (4)ఎన్డీఏ బడ్జెట్ కొత్తగా లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. తమ పాలసీలనే ఎన్డీఏ ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆరోపించారు. లోక్ సభలో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇంప్రస్ చేయలేదన్నారు సోనియా. ఈ బడ్జెట్ లో కొత్తగా ఏమీ లేదని…తమ పాలసీలు, స్కీంలనే మాత్రమే కాపీ కొట్టి బడ్జెట్ ప్రిపేర్ చేశారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా బడ్జెట్ పై విమర్శలు కురిపించారు. బడ్జెట్ సరిగా లేదన్నారు. ఈ బడ్జెట్ తో కామన్ పీపుల్ ఎదగలేరని ఆయన అన్నారు.

మరో కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ కూడా బడ్జెట్ పై విమర్శలు కురిపించారు. కామన్ ప్రజలకు ఏ మాత్రం ఆశాజనకంగా బడ్జెట్ లేదన్నారు. ప్రభుత్వ డిమాండ్ల కోసమే కొన్ని స్కీంలు పెట్టారని ఆయన అన్నారు. బడ్జెట్ నిరాశ కల్గించిందన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఈ బడ్జెట్ రిచ్ పీపుల్ కోసమేనని…సామాన్యుల కోసం కాదన్నారు సమాజ్ వాదీ పార్టీ సెక్రటరీ రామ్ గోపాల్ వర్మ.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy