ఎన్నికల హామీల అమలుకు సర్కార్ సిద్ధం..!

Kcr Cabinet3ఎన్నికల టైంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు కొత్త పథకాల గురించి సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడనున్నారు. దీని కోసం రాష్ట్ర కేబినేట్ మధ్యాహ్నం భేటీ కానుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ రోజు రెండో కేబినేట్ సమావేశం జరుగుతోంది. ఎన్నికల హామీల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వివిధ శాఖల కార్యదర్శులతో మధ్యాహ్నం భేటీ కానున్నారు.

ఎన్నికల సమయంలో రైతుల రుణమాఫీ గురించి కేసీఆర్ హామీ ఇచ్చారు. దీని గురించి ఈ రోజు కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రైతులకు లక్ష రూపాయల రుణాలు మాఫీ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటన చేసింది. అమరవీరుల కుటుంబాలకు ప్యాకేజీ, కుటుంబానికో ఉద్యోగంతో పాటు హైదరాబాద్ లో అమరవీరుల స్ధూపం నిర్మాణం గురించి కేసీఆర్ మాట్లాడే ఛాన్స్ ఉంది.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ స్పెషల్ ఇంక్రిమెంట్లు ప్రకటించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే దాని గురించి కేబినేట్ లో కీలక నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. వృద్దులు, వికలాంగులకు 1500 పెన్షన్ల పెంపు గురించి కేసీఆర్ మాట్లాడనున్నారు. ముస్లిం, ఎస్టీలకు 12 శాతం చోప్పున రిజర్వేషన్లు కల్పించే అంశం గురించి కూడా స్పందిచే ఛాన్స్ ఉంది.

  • తెలంగాణ ఉద్యమ టైంలో నమోదైన కేసుల ఎత్తివేత
  • తెలంగాణ పబ్లిక్ కమీషన్ ఏర్పాటు
  • తెలంగాణ ఎస్టీ కమీషన్  ఏర్పాటు
  • రాష్ట్రానికి కొత్త విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)
  • పారిశ్రామిక రంగానికి సింగిల్ విండో సిస్టమ్
  • స్థానికతపై నిర్ణయంతో పాటు  ఫీజు రీయింబర్స్ మెంట్ పై స్పష్టత
  • ఔట్ సొర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ
  • దళిత కుటుంబాలకు భూపంపిణీ

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy