ఎన్నేళ్లకు : శ్రీవారి సన్నిధిలో బంగారు బల్లి

bangaruballi tirumalaబంగారుబల్లి..కంచిబల్లి ఈ పేర్లను ఫోటోలో చూస్తేనే ఎవరో చెబుతుంటేనో వింటుంటే ..ఇవి నిజంగానే ఉంటాయా అని కొందరికి అనుమానంరాక తప్పదు. అయితే పూర్వం ఇవి ఎక్కువగా ఉండేవని..కాలక్రమేణా ఈ బంగారుబల్లులు అంతరించి పోయాయని చెబుతున్నారు పరిశోధకులు. చాలా రోజుల తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో ఓ బంగారు బల్లి దర్శణమిచ్చి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకూ తిరుమల కొండల్లో అందరూ అంతరించిపోయినట్లుగా భావిస్తున్న బంగారు బల్లి జాడ వెలుగుచూసింది. శ్రీవారి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో.. అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే మోకాళ్ల పర్వతం వద్ద 3 వేల 150 మెట్టు కొండల్లో ఆదివారం (మే-13) రాత్రి కనిపించి.. భక్తులు, పరిశోధకులను ఆశ్చర్యాలకు గురిచేసింది. గత కొన్నేళ్లుగా ఇవి కనిపించకుండా పోవడంతో.. ఏపీ ప్రభుత్వం వీటిపై సమగ్ర సర్వేకు పూనుకుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy