ఎన్ కౌంటర్ లో  ముగ్గురు ఉగ్రవాదులు మృతి

army-jammuజమ్మూకశ్మీర్ లో ఆర్మీ ఆపరేషన్ ముగిసింది. పుల్వామాల వున్న కాకపోరా న్యూ కాలనీల భద్రతా బలగాలు…ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. న్యూ కాలనీల ఉగ్రవాదులు  ఉన్నారని తెలువగానే  భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఆర్మీ, CRPF, స్పెషల్ ఆపరేషన్ టీంలో…ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ముగ్గురు ఉగ్రవాదులను  చంపేశారు జవాన్లు. ఉగ్రవాదుల నుంచి  మూడు ఏకే 47- రైఫీళ్లను స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన స్పెషల్ ఆపరేషన్  గ్రూప్ తో పాటు 183 CRPF  బెటాలియన్ కు చెందిన భద్రతా సిబ్బంది ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో  ఓ అధికారి గాయపడ్డాడు. ఎన్ కౌంటర్ లో  చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులను  గుర్తించింది ఆర్మీ. మజీద్ మీర్,  షరిఖ్ అహ్మద్,  ఇర్షాద్ అహ్మద్ గా గుర్తించారు

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy