ఎప్పుడంటే అప్పుడు పంచ్ కొడితే సరిపోదు..!

bio_mwnగవర్నమెంట్ జాబ్.. ఆహ్..! వేలకు వేలు జీతం.. ఎప్పుడంటే అప్పుడు వెళ్లొచ్చు.. ఏం చేసినా ఎవడూ పట్టించుకోడు.. ఇలా ఎన్నో … మరెన్నో. టైమ్ సెన్స్ విషయంలో సర్కారీ బాబులపై ఉన్నన్ని జోక్స్ మరొకరిపై లేవు. ఇలా రావడం అలా పోవడం… పంచ్ కొట్టామా లేదా… అసలు కొట్టడం దేనికి.. అన్నంతగా ప్రవర్తిస్తుంటారు. దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టింది కేంద్రం. కరెక్ట్ టైమ్ కి ఉద్యోగులందరూ వచ్చే ఏర్పాట్లు చేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రధాని మోడీ ఉద్యోగుల సమయపాలనపై బాగా ఫోకస్ చేశారు. పీఎంవోలో ఆఫీసర్లు అందరూ సమయానికి  డ్యూటీకి వచ్చేలా చేయడంలో సక్సెస్ అయిన ఆయన… దేశవ్యాప్తంగా ఉద్యోగులందరూ సమయపాలన పాటించేలా చేయడంపై దృష్టి పెట్టారు. దీనికోసం కొత్త విధానాన్ని రూపొందించమని అధికారులను ఆదేశించారు. ఆ పనిలో పడ్డ అధికారులు కొత్తగా రూపొందించిన విధానంలో ఆధార్ నంబర్ అనుసంధానించిన బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.

ప్రస్తుతం www.attendance.gov.in ద్వారా ఏ రోజు ఎంత మంది ఉద్యోగులు ఆఫీసుకి వచ్చారో తెలుసుకునే వెసులుబాటు ఉంది. అయితే దీన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు కొత్త విధానాన్ని రూపొందించామంటున్నారు అధికారులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy