ఎమన్ గుర్తుందిగా.. ఆమె సన్నబడుతోందట.!

eman-ahmed-attiఎమన్ అబ్దుల్ అట్టీ.. ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా గుర్తింపు పొందిన ఈజిఫ్ట్ మహిళ. ప్రస్తుతం ఆమె అబుదాబిలోని బుర్జీల్ హాస్పిటల్ లో వైద్యసేవలు అందుకుటోంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ఒకప్పుడు మంచానికే పరిమితమైన ఎమన్ ఇప్పుడు తనంతట తానే వీల్ చైర్‌లో కూర్చోగలుగుతోంది. నిలబడగలుగుతోంది. తనకు కావలసిన ఆహారాన్ని తానే వడ్డించుకుని తింటోంది. ఈ పరిస్థితితో ఎమన్ చాలా సంతోషంగా ఉంది.  సరైన ఆహారం తీసుకుంటూ.. అందరితో కులాసాగా మాట్లాడుతోంది. ప్రస్తుతం 177 కేజీలకు వచ్చిందంటున్నారు డాక్టర్లు. కొన్ని నెలల క్రితం 498కేజీలతో బరువుతో ఉన్న ఆమె.. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సాయంతో భారత్ కు వచ్చింది. ముంబైలోని ఓ హాస్పిటల్ ఆమెకు ఉచితంగా వైద్యం అందించింది. కొన్ని ఆపరేషన్లు నిర్వహించిన వైద్యులు ఆమె బరువుని కొంతమేర తగ్గించగలిగారు. కానీ ఎమన్ సోదరి చికిత్స అందించిన వైద్యులు, హాస్పిటల్‌ను విమర్శించింది. తన సోదరి ఆరోగ్యాన్ని క్షీణించేలా చేశారని ఆరోపించింది. దీంతో ఎమన్‌కు ఉచితంగా వైద్యం అందించేందుకు  అబుదాబి నగరంలోని బుర్జీల్ హాస్పిటల్ ముందుకొచ్చింది. దీనికి యూఏఈ ప్రభుత్వం సహకారం అందించడంతో ఆమెను చికిత్స అందిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy