ఎమర్జెన్సీ అలర్ట్ : వెంటనే మీ ట్విట్టర్ పాస్ వర్డ్ మార్చుకోండి

twitterతక్షణమే మీ ట్విట్టర్ అకౌంట్ పాస్ వర్డ్ మార్చుకోవాలని పిలుపునిచ్చింది కంపెనీ. అకౌంట్ ఓపెన్ చేసి.. లాగ్ ఔట్ కాని వారు ఎవరైనా సరే.. వెంటనే తమ అకౌంట్లను లాగ్ ఔట్ చేసి.. ఆ వెంటనే పాస్ వర్డ్ మార్చుకోవాలని ట్విట్టర్ సీఈవో జాగ్ డోర్సే ప్రకటించారు. ప్రస్తుతం ట్విట్టర్ అకౌంట్ లో ఓపెన్ చేస్తున్న వారు.. ఇప్పుడు అకౌంట్ పై వర్క్ చేస్తున్న వారు కూడా పాస్ వర్డ్ మార్చుకోవాలని సూచించారు.

ట్విట్టర్ లోకి ప్రవేశించిన ఓ బగ్ వల్ల.. మీ పాస్ వర్డ్ లు అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది సామాన్యమైన విషయం కాదని అభిప్రాయపడ్డారు. స్టోర్ అయిన పాస్ వర్డ్ లన్నింటినీ తమ ఫ్లాట్ ఫాం నుంచి తొలగిస్తున్నామని కూడా ప్రకటించారు. ఇక ఎవరకీ ఇవి కనిపించే అవకాశం లేదనంటూ గురువారం తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ట్విట్టర్ అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాస్ వర్డ్ లను అత్యవసరంగా మార్చుకోవాలని యూజర్లను కోరింది.

అయితే ట్విట్టర్ లోకి చొరబడిన బగ్ ద్వారా ప్రభావానికి గురైన పాస్ వర్డ్ ల సంఖ్య ఎంత అన్నది మాత్రం ట్విట్టర్ తెలపలేదు. తమ విచారణలో ఎవరూ కూడా వాటిని మిస్ యూజ్ చేయలేదని.. ఆ విషయంలో స్పష్టత ఉందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరూ తమ పాస్ వర్డ్ మార్చుకోవలసిందిగా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సె తన ట్వీట్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ట్విట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా 33 కోట్లమంది యూజర్లు ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy