ఎమర్జెన్సీ సేవలకు ఒకటే నెంబర్

oneఅత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించేందుకు కొన్నిప్రత్యేక నంబర్లు ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో పోలీస్ ఎమర్జెన్సీకి 100, ఫైర్ సర్వీస్ కు 102, హెల్త్ ఎమర్జెన్సీలో 108  నంబర్లకు కాల్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు మరిన్ని సేవలకు కూడా హెల్ప్ లైన్ నంబర్లున్నాయి. అయితే వీటన్నింటిని ఒకే గొడుగుకిందకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా అన్ని రకాల సేవలకు 112 అనే నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ద్వారా ఈ మార్పులు చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇక ఏ హెల్ప్ కావాలన్నా… 112 నంబర్ కు కాల్ చేస్తే సరిపోతుంది. దీనికోసం దేశ వ్యాప్తంగా 36 ప్రాంతాల్లో 24 గంటల పాటు పనిచేసేలా ప్రజాభద్రత సమాధాన కేంద్రాలు ఏర్పాటుచేయనుంది.

 

24-1435154215-ap-t-police-645

 

Firebrigadeఎలాంటి ఎమర్జెన్సీలోనైనా ల్యాండ్ లైన్, మొబైల్, ఈ –మెయిల్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లోని పానిక్ బటన్, వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ ద్వారా ఈ  కేంద్రాలకు ఫోన్ చేయవచ్చు. ఈ కాల్ సెంటర్లకు ఫోన్ చేయగానే జీపీఎస్ ద్వారా మన లొకేషన్ తెలుసుకుని.. దగ్గరలో ఉన్న పోలీసు వాహనాలను అలర్ట్ చేసి.. సంఘటన జరిగిన ప్రాంతానికి పంపిస్తారు. వారు అక్కడికి వెళ్లి బాధితులకు సాయం అందించడంతో పాటు… ఎప్పటికప్పుడు పరిస్థితిని కాల్ సెంటర్ కు అందజేస్తారు. దీనికోసం పోలీసు వెహికిల్స్ కు కూడా జీపీఎస్ పరికరాలు అమర్చుతారు. పోలీసు వాహనాలు ఎక్కడెక్కడున్నాయనే విషయం..కంట్రోల్ రూంలో డిజిటల్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటుంది.

 

 

 

01BG108_AMBULANCE__1070165gకొత్త విధానం అమలు కోసం దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఒక్కొక్కరిని సెలక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వనుంది కేంద్రం. తర్వాత వీరు.. తమ తోటి సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు…ఈ కాల్ సెంటర్ కు వచ్చిన ఫోన్ల వాయిస్ రికార్డ్ చేసి.. అక్కడున్న సిబ్బంది ఎలా పనిచేస్తున్నరనే అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు రివ్యూ  చేస్తారు. అత్యవసర పరిస్థితిలో సాయం కోసం ఫోన్ చేసిన బాధితులకు వేగంగా నాణ్యమైన సేవలందించడమే లక్ష్యంగా ఈ కొత్త కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy