ఎమ్మెల్యేల కేంపులు షురూ !

council

మరో టీడీపీ ఎమ్మెల్యే చేరికతో పెరిగిన టీఆర్ఎస్ బలం

వైసీపీ ఎమ్మల్యే సపోర్ట్ కూడా టీఆర్ఎస్ కే!

స్టేట్ లో పెద్దల పోరు షురూ అయింది. MLA కోటాలో జరుగుతున్న MLC  ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 6 స్థానాలకు ఖాళీగా ఉంటే ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పార్టీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ , టీడీపీ నుంచి ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ బలాబలాలను బట్టి టీఆర్ఎస్ కచ్చితంగా 4 స్థానాలను గెలుచుకోవడం ఖాయం. అటు ఉన్న ఎమ్మెల్యేలతో  కాంగ్రెస్  గట్టెక్కుతోంది. ఇక టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలతో ఒక స్థానం గెలుచుకునే అవకాశమున్నా జంప్ జిలానీలతో అసలు చిక్కు వచ్చి పడింది. అటు ఎలాగైనా ఐదో అభ్యర్థిని గెలిపించుకుంటామని అధికార పార్టీ చెబుతుండడంతో అందుకు తగినట్టు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు గులాబీ గూటికి జై కొట్టడంతో మిగతా పార్టీలో కలవరం మొదలైంది. ఏ పార్టీకి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలమీద నమ్మకం లేకపోవడంతో కేంపులు ఏర్పాటు చేసి, తమవాళ్ళను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలను చాలెంజింగా తీసుకున్న టీఆర్ఎస్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

అటు MIM, వైసీపీలు కూడా అధికార పార్టీకి మద్దతు ప్రకటించాయి. ఇక టీడీపీ నుంచి కారెక్కిన వారంతా ఔట్ అండ్ రైట్ TRS అభ్యర్థులకే ఓటేస్తామని చెబుతున్నారు. నిన్నటి నిన్న కేసీఆర్ ను కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు టీడీపీపై గుస్సా అవుతున్నారు. మాధవరంతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గులాబీ టీం. మాక్ పోలింగ్ తో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పిస్తున్నారు. కాసేపట్లో మళ్లీ మాక్ పోలింగ్ ను నిర్వహించనున్నారు.

అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి దక్కే ఒకే ఒక సీటును కచ్చితంగా గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు హస్తిన పెద్దలు కూడా ఎన్నికపై స్పెషల్ కాన్సంట్రేట్ చేశారు. ఇప్పటికే సీఎల్పీ మీటింగ్ కు అటెండయిన ఢిల్లీ పెద్దలు ముఖ్య నేతలకు గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎన్నికలు జరిగే వరకు ఎమ్మెల్యేలందరినీ క్యాంపులకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. గండిపేటలో ఓ రిసార్ట్ లో క్యాంపు నిర్వహిస్తున్నారు నేతలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy