ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

BHANWAR LALరాష్ట్రంలో ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే ఆరు ఏకగ్రీవం కాగా… మిగిలిన ఆరింటికి పోలింగ్ జరగనుంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, నల్గొండ జిల్లాలో నలుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. ప్రతి జిల్లా సబ్‌డివిజన్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పోలింగ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేశామని… ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈసీ.  ఎన్నికలలో ఎవరికి ఓటేశారో బయటకు చెబితే అది నేరం అవుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నామని, సెల్‌ఫోన్లను గానీ, కెమెరాలను గానీ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ఈనెల 30న జరగనుంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy