ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: బోనస్ గా 1000 GB డేటా

airtelజియో తరహాలో ఎయిర్ టెల్ కూడా బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లో పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త బోనస్ డేటా ఆఫర్ కింద కొత్త కస్టమర్లకు 1000 GB వరకు అదనపు డేటాను అందిస్తామని తెలిపింది. ఇందుకోసం ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తున్న చౌకైన ప్లాన్లు రూ.899 నుంచి ప్రారంభమవుతాయి. దీని కింద నెలకు 60 GB డేటాను, అదనంగా ఏడాదిలో 500 GB డేటాను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ఈ ప్లాన్‌ స్పీడు 40 ఎంబీపీఎస్‌ వరకు అని తెలిసింది. మరో ప్లాన్‌ రూ.1099 కింద 40 ఎంబీపీఎస్‌ స్పీడులో నెలకు 100 GB డేటాను ఆఫర్‌ చేయనున్నామని, అంతేకాక 1000 GB బోనస్‌ డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు ప్రకటించింది.

రూ.1299 ప్లాన్‌కు, రూ.1499, రూ.1799 ప్లాన్లకు 1000 GB వరకు బోనస్‌ డేటాను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. కానీ ఇవన్నీ కొత్త కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్‌ జియో కూడా తన ఫైబర్‌ నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేయడానికి టెస్టింగ్‌ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని లాంచ్‌చేసింది కూడా. కానీ దేశవ్యాప్తంగా లాంచ్‌ చేయడానికి జియో ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy