ఎయిర్ పోర్ట్ నుంచే వెనుదిరిగిన తృప్తి దేశాయ్..

శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భూమాత బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్ ఎయిర్ పోర్ట్ నుంచే వెనుదిరిగారు. ఆలయం తెరుచుకుందన్న విషయం తెలుసుకున్న ఆమె శుక్రవారం(నవంబర్ 16) కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్ట్ కు ఉదయం 4.40  ఆరుగురు మహిళలతో కలిసి చేరుకుంది. అయితే తృప్తి రాక తెలుసుకున్న అయ్యప్ప భక్తులు, వివిధ సంఘాల నేతలు ఎయిర్ పోర్ట్ ను చుట్టుముట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో తృప్తి, ఆమె అనుచరులు ఉదయం నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు లోపలే ఉన్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ దగ్గర ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు కూడా నిరసన తెలిపారు. తృప్తిని తమ వాహనాల్లో తీసుకెళ్లబోమని చెప్పారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఆందోళనకారులకు, తృప్తి దేశాయ్‌కి నచ్చజెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఎవరూ వినిపించుకోలేదు. ఆందోళనలు ఆగకపోవడంతో తృప్తి దేశాయ్, ఆమెతో పాటు వచ్చిన మహిళలు​ ఎయిర్‌ ‌‌‌‌‌‌‌పోర్ట్ లోనే 15గంటల పాటు వెయిట్ చేశారు. ఆలయాన్ని దర్శించుకునేంత వరకు తాను తిరిగివెళ్లేది లేదని వెళ్లే ఆమె తేల్చిచెప్పారు. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో  వెనక్కి వెళ్లేందుకు తృప్తి అం గీకరించారు. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఆమె పుణె వెళ్లిపోయారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy