ఎయిర్ పోర్ట్ రన్ వేపై కోబ్రా

shamashabadశంషాబాద్ ఎయిర్ పోర్టులోకి పాము చొరబడింది. ఏడో నంబర్ ఫ్లైట్ బేలోకి పాము రావడంతో.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు సిబ్బంది. వెంటనే తేరుకుని… రెస్క్యూటీమ్ ని పిలిచారు. ఈ కోబ్రా 10 అడుగులు ఉంది. ఇంత పెద్ద పామును చూసి రన్ వే పై ఉన్న సిబ్బంది పరుగులు తీశారు. ఆ కోబ్రా.. బుసలు కొడుతోంది. రన్ వేపై అటూ ఇటూ తిరుగుతూ కలకలం రేపింది. సిబ్బంది పట్టుకోవటానికే చాలా టైం పట్టింది. అంత పెద్ద పామును ఈ ప్రాంతంలో చూడటం ఇదే మొదటిసారి అంటున్నారు సిబ్బంది. ఈ కోబ్రాను జంతు సంరక్షణ అధికారులకు అప్పగించారు. ఒకవేళ ఆపాము ఓ విమానంలోకి వెళ్లుంటే అప్పుడు పరిస్థితి ఏంటీ అని తలచుకుని ప్రయాణికులు ఒణికిపోయారు. సిబ్బంది గమనించి.. పామును పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు ప్రయాణికులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy