ఎయిర్ బేస్ అటాక్ పై NIA,BSF విచారణ

Pthankot-attackపఠాన్ కోట్ ఎయిర్ బేస్ అటాక్ పై దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. సెక్యూరిటీ లూప్ హోల్స్ పై దృష్టిపెట్టడంతో పాటు రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి ఆరుగురు టెర్రరరిస్టులు ఎలా వెళ్లగలిగారన్న యాంగిల్ లో ఎంక్వైరీ మొదలుపెట్టారు. గురుదాస్ పూర్ నుంచి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ 92 కిలోమీటర్ల వరకు టెర్రరిస్టులు ఎలా ప్రయాణించగలిగారు ? 23 మీటర్ల ఎత్తున్న ఎలక్ట్రిఫైడ్ ఎయిర్ బేస్ గోడను ఎలా దాటగలిగారు ? ఎయిర్ బేస్ లో 3 వేల కుటుంబాలున్నాయి. వాళ్లలో టెర్రరిస్టులకు ఎవరైనా సహకరించారా ? దాడికి ముందే ఎయిర్ బేస్ లో టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. ఇక దర్యాప్తులో హైజాక్ అయిన ఎస్పీ సల్విందర్ పాత్ర కీలకంగా మారింది. డిసెంబర్ 31న అతని కదలికలతో పాటు దర్గా సందర్శనపైనా NIA దృష్టిపెట్టింది. విచారణలో ఆయన మీడియాకిచ్చిన ఇంటర్య్వూతో కంపేర్ చేసి విచారణ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఎస్పీతో పాటు ఉన్న రాజేశ్ వర్మ.. కుక్ నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ అటాక్ పై అన్ని వైపుల నుంచి మోడీ సర్కారుపై విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా సెక్యూరిటీ లూప్ హోల్స్ పైనే దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయి. ఇక NIAతో పాటు BSF కూడా విచారణ మొదలుపెట్టింది.  15 రోజుల్లోగా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని డిసైడైంది బీఎస్ఎఫ్. భారత్ నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. పాక్ విచారణ మొదలుపెట్టింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో జైష్ ఏ మొహ్మద్ ఉగ్రదాడికి పాల్పడినట్టు ప్రాథమికంగా ఓ నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు, మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్టు తేల్చారు. అయితే భారత్ సమర్పించిన ఆధారాలు పూర్తిస్థాయిలో లేవని పాక్ తెలిపింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy