ఎయిర్ సెల్ మాక్సిక్ కేసులో చిదంబరంకు మధ్యంతర బెయిల్

PCఎయిర్ సెల్ మాక్సిక్ కేసులో కాంగ్రెస్ నాయకుడు, కేంద్రమాజీ మంత్రి చిదంబరంకు మధ్యంతర బెయిల్ లభించింది. జూన్ 5 వరకూ ఆయనను అరెస్ట్ చేసేందుకు వీల్లేకుండా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5కు ముందు ఈ కేసుకి సంబంధించి చిదంబరం ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. ముందస్తు బెయిల్ కోసం చిదంబరం తరపున సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్ లీడర్ కపిల్ సిబల్ న్యాయస్ధానంలో వాదనలు వినిపించారు. ఎయిర్ సెల్ మాక్సిక్ మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి-28న చిదంబరం కొడుకు కార్తీని లండన్ నుంచి తిరిగివస్తుండగా చెన్నై ఎయిర్ పోర్టులో సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ, సీబీఐలు ఈ కేసుని విచారిస్తున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy