ఎరుపు వర్ణంతో శోభిల్లుతున్న యాగశాల

kcr-yagam 26అయుత చండీ మహాయాగశాల ఎరుపు వర్ణంతో శోభిల్లుతోంది. నాలుగో రోజు రుత్విజులు ఎరుపు వర్ణం వస్ర్తాలను ధరించారు. చివరి రెండు రోజులే చండీయాగం ఉండటంతో యాగానికి  భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల సంఖ్య అధికమవడంతో కుంకుమార్చన కార్యక్రమాన్ని రద్దు చేశారు.  భక్తుల రద్దీపెరగడంతో మరో రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు పోలీసులు.

harish-yagamఅయుత చండీ మహాయాగం ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తున్నారు. మొదటి  మూడు రోజులు మమూలు వస్ర్తాధారణలో కనిపించిన హరీష్‌రావు ఇవాళ ఎరుపు వర్ణం వస్త్రాలు ధరించారు. ఎర్రటి ధోతి ధరించారు హరీష్. ఇక వాకీటాకీతో పరిస్థితులపై అధికారులను హరీష్ ఆరా తీస్తున్నారు. యాగానికి వచ్చే ప్రముఖులకు స్వాగతం పలుకుతూ.. యాగశాల దగ్గరకు తీసుకెళ్తున్నారు.  సీఎం కేసీఆర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితులు తెలియజేస్తున్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వారి సౌకర్యాలపై పోలీసులతో సమీక్షిస్తున్నారు.

Sharadpawar1నాలుగో రోజు చండీయాగానికి రాజకీయ నాయకులతో పాటు అధిక సంఖ్యలో ప్రముఖు హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ యాగానికి హాజరయ్యారు. పవార్ యాగశాలకు చేరుకోగానే సీఎం కేసీఆర్ సతీసమేతంగా  ఆహ్వానం పలికారు.పుష్పగుచ్చం ఇచ్చి సాధరంగా ఆహ్వానించారు. శరద్ పవార్ వెంట మాజీ మంత్రి గీతారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామి రెడ్డి ఉన్నారు.

roshaiahఅయుత చండీయాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ రోశయ్యకు శాలువా కప్పి సన్మానించారు. అమ్మవారి వద్ద నుంచి తీసుకొచ్చిన పూలమాల వేసి సత్కరించారు. అమ్మవారి వెండి ప్రతిమను అందజేశారు.

 

nnvramanaఅమ్మవారిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ యాగశాలకు వచ్చారు  సీఎం కేసీఆర్ దంపతులు ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలికారు. తర్వాత ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. అమ్మవారి వద్ద నుంచి తెచ్చిన పూలమాల వేసి సత్కరించారు. అమ్మవారి వెండి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు.

yagam 26గవర్నర్ నరసింహన్ దంపతులు నాలుగో రోజు జరుగుతోన్న యాగ క్రతువులో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు దంపతులు యాగానికి హాజరై పూజలు చేశారు.అయుత చండీయాగానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ , సినీనటుడు నాగార్జున చండీయాగానికి హాజరై పూజలు చేశారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy