ఎర్రపండు చేపకు రూ. 30వేలు

Brahmaputraఅత్యంత అరుదుగా దొరికే కలిచా చేప ప్రకాశం జిల్లా జాలర్ల వలకు చిక్కింది. రూ. 30వేల రూపాయలకు అమ్ముడైంది. దీన్ని తెలుగులో ఎర్రపండు చేపగా పిలుస్తారు. గంగులు అనే జాలరికి ఈ చేప చిక్కింది. 25 కిలోలు ఉన్నట్టు చెబుతున్నారు. కోల్ కతా లాంటి ప్రాంతాల్లో ఈ చేపను ఆయుర్వేదంలో వినియోగిస్తుంటారు. అలాగే కేన్సర్, మెదడు సంబంధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయారీలో ఈ చేపను ఉపయోగిస్తుంటారు. సాధారణంగా ఇది అరేబియా సముద్రంలో కనిపిస్తుంటుందని.. అయితే హిందూమహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి చేరి ఉండొచ్చని అంటున్నారు స్థానికులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy