ఎర్రవెళ్లి అయ్యింది.. భక్తుల కల్పవల్లి

ayuta gaamఅయుత చండీ మహా యాగం కీలక ఘట్టానికి చేరింది. 5 రోజుల పాటు జరగనున్న ఈ మహా క్రతువులో..  నాలుగో రోజుకు చేరింది. వేద పండితుల మంత్రోచ్చరణాలతో ఎర్రవల్లి యాగశాల ప్రాంగణం.. పుణ్య క్షేత్రంలా మారింది. బ్రహ్మోత్సవాల స్థాయిలో యాగం జరుగుతుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.

మెదక్ జిల్లా ఎర్రల్లిలో అయుత మహా చండీ యాగం కన్నుల పండువగా జరుగుతోంది. యాగం నాలుగో రోజు గురు ప్రార్ధన, గణపతి పూజ, ఏకాదశ న్యాస పూర్వక చతుసహస్ర చండీపారాయణాలు, నవావరణ పూజ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం, మహాసౌరం, ఉక్త దేవతా జపాలు, కుమారి, సుహాసిని, దంపతీపూజ మహా మంగళహారతి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధార్మిక ప్రవచనాలు, సాయంత్రం కోటి నవాక్షరీ జపం, అష్టావధాన సేవ, మహా మంగళ హరతి చేయనున్నారు. ఇవాళ్టి యాగంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య పాల్గొననున్నారు.

yaagam (2)అయుత మహాచండీయాగం మూడో రోజు శోభాయమానంగా జరిగింది. కేసీఆర్ దంపతులు గురుప్రార్థన, గోపూజ చేశారు. అమ్మవారిని ఆవాహన చేసుకునేందుకు రుత్వికులు.. చండీకవచం, అర్గళ, కీలక పఠనం, ఏకదశన్యాస పూజలు నిర్వహించారు. చతుర్వేద పారాయణ యాగశాలలో చేసిన పూర్ణాహుతిలో.. సీఎంతో పాటు అతిథులు పాల్గొన్నారు. పదివేల జపాలు.. వేయి పుష్పాలతో.. యాగ శాల నలు దిక్కులా… శాస్త్రోక్తంగా రాజశ్యామల యాగాన్ని రుత్వికులు నిర్వహించారు.

మూడో రోజు యాగంలో భాగంగా కోటి నవాక్షరీ జపం. పార్థివ లింగ పూజ. అష్టావధాన సేవ. మహా మంగళ హారతి. విశేష నమస్కారాలను రుత్వికులు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. రాత్రి .. శ్రీరామ లీల గేయ కథాగానంతో పాటు.. ప్రత్యేక కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంచాయి. మూడోరోజు తెలుపు రంగు వస్త్రాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు రుత్వికులు. మరోవైపు… విశిష్ట అతిథులుగా హాజరైన ఆధ్యాత్మిక గురువులు త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి.. శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి.. సీఎం దంపతులను ఆశీర్వదించారు.

GOVERNERమహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు దంపతులు… సీఎం కేసీఆర్ దంపతులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. AP స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, మండలి చైర్మన్ చక్రపాణి, మాజీ DGP పేర్వారం రాములు పూజకు హాజరయ్యారు. సినీ నటుడు కృష్ణంరాజుతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా యాగశాలను దర్శించుకున్నారు. శృంగేరీ పీఠం నుంచి వచ్చిన ప్రధాన రుత్వికుల్లో ఒకరు.. ఫణిశశాంక శర్మ చండీయాగ విశిష్టత వివరించారు. విశ్వశాంతి కోరుతూ… ఈ మహా క్రతువు నిర్వహిస్తారని తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy