ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తెలంగాణ: కేటీఆర్

telanganaతెలంగాణ రాష్ట్రానికి భారీ ఎలక్ట్రానిక్ పరిశ్రమల సముదాయన్ని మంజూరు చేసింది కేంద్రం. రంగారెడ్డి జిల్లాలో 6వందల ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది. దీంతో ఎలక్ట్రానిక్స్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న  ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక ముందడుగు పడింది. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌పై కేంద్ర ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అజయ్‌కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ శివార్లలో వేయి ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తమ ఐటీ విధానపత్రంలో తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోనే వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాయం కోసం కేంద్రానికి ప్రతిపాధించింది. ఇందులో ఒక పరిశ్రమను కేంద్రం తాజాగా మంజూరు చేసింది. త్వరలోనే మరో సముదాయం మంజూరవుతుందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. మంజూరైన పరిశ్రమకు రాష్ట్రప్రభుత్వం భూమిని కేటాయిస్తే..కేంద్ర మౌళిక వసతులు కల్పిస్తుంది.

ఎలక్ట్రానికి ఇండస్ట్రీలకు మంచి భవిష్యత్ ఉండటంతో వాటి ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలు పరిశ్రమలకు స్థలాలు కేటాయించింది.  ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా35 వేల మందికి ఉపాధి అవకాశాలు.. పరోక్ష మరో 2లక్షల 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy