ఎలక్షన్ టైం : ఓటర్ల నమోదుకు అవకాశం

Voter-ID GHMCఎన్నికలు దగ్గర పడుతుండటంతో కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఎలక్షన్ అధికారులు. గ్రేటర్‌ పరిధిలో మే 1 నుంచి 31వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌. బుధవారం (ఏప్రిల్-11) GHMC ఆఫీసులో గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల లిస్టులో పూర్తి ఆధారాలు పరిశీలించాకే చిరునామా మారిన, మరణించిన వారి పేర్లు తొలగించాలన్నారు. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు బూత్ లెవల్‌ అధికారుల నియామకం, శిక్షణ, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. రిటైర్డ్‌ ఉద్యోగులను బీఎల్‌ఓలుగా నియమించుకోవాలన్నారు GHMC కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి. దివ్యాంగులను కూడా బీఎల్‌ఓలుగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy