ఎలా తీస్తాడో : వర్మ దర్శకత్వంలో NTR జీవిత చరిత్ర

varma NTRతెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలత్తెకునేలా చేసింది NTR అనబడే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో  పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. రాంగోపాల్ వర్మ. NTR జీవిత చరిత్రను తెరకెక్కించనున్నారు. అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ఆడియో కూడా రిలీజ్ చేశారు.

నందమూరి తారక రామారావును కీర్తిస్తూ సాగిన ఈ మాటలు ఇలా ఉన్నాయి…

ఆయన ఒక మహానటుడే కాదు, మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు. నాకు ఆయనతో పర్సనల్ గా ఉన్న అనుబంధం ఏమిటంటే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు సినిమా చూడటానికి 23 సార్లు బస్ టికెట్ కి డబ్బుల్లేక 10కి.మీ. దూరం కాలి నడకన వెళ్లేవాడిని. అంతే కాకుండా NTR తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగ్ లో నేల ఈనినట్టు వచ్చిన  లక్షలాది మందిలో నేనూ ఉన్నాను. అలాంటి అతి మామూలు నేను.. ఇప్పుడు NTR జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకు ఎక్కించడం చాలా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.

ఈ అత్యంత నిజమైన ఆ మహామనిషి NTR బయోపిక్ లో ఆయన శత్రువులెవరో, నమ్మక ద్రోహులెవరో, ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలేమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా NTR చిత్రం లో చూపిస్తాను. “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అని రాయప్రోలు గారంటే, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా ఎనిమిది కోట్ల తెలుగు వాళ్లలో కేవలం ఒకడిగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి చెప్పేది ..ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ ను…

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy