ఎలా మింగావ్ రా : ఏడాది పిల్లోడి కడుపులో నెయిల్ కట్టర్

nail-cutterఏడాది పిల్లోడు.. ఆడుతూ పాడుతూ తిరుగతున్నాడు. అప్పుడప్పుడే ఊ.. ఊ.. కొడతాడు. తినటం కూడా రాదు.. కాకపోతే చేతికి దొరికింది ఏదైనా సరే నోట్లో పెట్టుకుంటుంటారు. ఆ వయస్సులో జాగ్రత్తగా ఉండాల్సిన టైం అది. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ తన చేతికి దొరికిన నెయిల్ కట్టర్ ను బుడుక్కున్న మింగేశాడు ఈ బుడతడు. మింగిన వెంటనే ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకు అనేది ఎంత సేపటికీ పేరంట్స్ కు అర్థం కాలేదు. కొన్ని గంటల తర్వాత భయపడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికి గానీ అసలు విషయం తెలియలేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

చైనా నార్త్ – ఈస్ట్ ప్రాంతంలోని చాంగ్‌చున్ నగరం. ఆ చిన్నారి పేరు ఫిఫీ. ఏడాది వయస్సు. ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్నారి కడుపులోకి వెళ్లిపోయింది నెయిల్ కట్టర్. ఆ పిల్లోడి బాధ వర్ణనాతీతం. వెంటనే ఆ పిల్లాడిని చాంగ్‌చున్‌లోని పిల్లల ఆస్పత్రికి తరలించారు. 2.4 ఇంచులు ఉన్న నెయిల్ కట్టర్‌ను పిల్లాడి కడుపులో నుంచి ఆపరేషన్ చేసి బయటికి తీశారు డాక్టర్లు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యంగా ఉన్నాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy