ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదకు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఇన్‌ ఫ్లో అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శనివారం ఉదయం 5 గంటలకు 39వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 3 గేట్లను 0.5 మీటర్ల మేర ఎత్తి 45,729 క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు 38,656 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 6 గేట్లను 0.5 మీటర్లు, 4 గేట్లు ఒక మీటరు మేర ఎత్తి 38,656 క్యూసెక్కులు వదిలారు. ఉదయం 11 గంటలకు 49,406 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 8 గేట్లు 1 మీటరు, 2 గేట్లు 0.5 మీటర్ల మేర ఎత్తి అంతే మొత్తంలో విడుదల చేశారు. మధ్యాహ్నం నుంచి 74,870 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 4 గేట్లు 2 మీటర్లు, 6 గేట్లు 1 మీటరు మేర ఎత్తి అంతేస్థాయిలో నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.7 టీఎంసీలు, 485.14 అడుగుల నీటి మట్టానికి గాను 484.4 అడుగుల మేర నీరు ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy