ఎల్ నినో ఎఫెక్ట్ తోనే భారీ వర్షాలు

el ninoసౌత్ ఇండియాకు మరో వానగండం. వచ్చే మూడు నాలుగు నెలల్లో విపరీతమైన వానలు కురిసే అవకాశముందంటోంది ఐక్యరాజ్య సమితి. చెన్నయ్ లో కురిసిన వానలు రిహార్సల్ మాత్రమేనని, అంతకు మించిన వానలు కురిసినా ఆశ్చర్యంలేదని వార్నింగ్ ఇచ్చింది UNO.

నెల రోజుల పాటు కురిసిన వానలకు ఈ మధ్య బ్రేక్ పడింది. చెన్నైలో ఇంకా బురద కష్టాలు తీరనే లేదు. దీన్నుంచి కోలుకోవడానికే కొన్ని నెలలు పడుతుందని అంచనా. ప్రకృతి పగబడితే రిజల్ట్ ఎలా ఉంటుందో త్రీడీలో చూపించాయి చెన్నై వర్షాలు. రాబోయే మూడు నాలుగు నెలల్లో అంతకుమించని వర్షాలు సౌత్ ఇండియాను ముంచెత్తబోతున్నాయన్నది లెటెస్ట్ రిపోర్ట్. చెన్నయ్ ఎడతెరిపిలేని వానలు ఎల్ నినో వల్లనేనని ఐక్యరాజ్య సమితి విశ్లేషించింది. ఎల్ నినో ఎఫెక్ట్ తోనే మరిన్ని వర్షాలకు రెడీ కావాలని యూఎన్ఓ వార్నింగ్ ఇచ్చింది.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నాలుగునెలల్లో… పదేపదే తుఫాన్లు వచ్చి భారీగా వర్షాలు కురవవచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ఎస్కాప్ కమిషన్ జోస్యం చెప్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాల్లో విపరీతంగా వానలు కురిసి ఊళ్ళకు ఊళ్లను వరదలు ముంచెత్తే అవకాశం ఉందన్నది ఎస్కాప్ అంచనా. మధ్య భారతంలోని చాలా ప్రాంతాల్లో, శ్రీలంకలో కూడా వానలు బాగా పడొచ్చంటోంది ఎస్కాప్ రిపోర్ట్. అలాగే ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, మంగోలియాలాంటి దేశాల్లో వానలు అస్సలు కురవకుండా కరువు కంటిన్యూ కావచ్చని ఎస్కాప్ అంచనా.

ఎల్ నినో ప్రభావం 2016 మార్చి వరకు ఉండొచ్చంటోంది ఎస్కాప్ రిపోర్ట్. నిజానికి ఎల్ నినో ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఉండదు. కానీ ఈసారి దాని ప్రభావం ఎక్కువ కాలం ఉండడం ఆశ్చర్యంగా ఉందంది ఎస్కాప్. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాతావరణ మార్పుల కారణంగానే ఎల్ నినో ఏర్పడుతుంది. ఎల్ నినో కారణంగా పసిఫిక్ లో ఒకవైపు కరువు కాటకాలు, మరోవైపు వానలు వరదలు వస్తాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy