ఎవరికీ చెప్పొద్దు : రహస్యం మన హక్కు!

supreme-court_660_020913075242‘గోప్యత’ అనేది ప్రాథమిక హక్కు అని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 నుంచి దానిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారని అటార్నీ జనరల్‌ కె.కె. వేణు గోపాల్‌ అన్నారు. ఆధార్‌ కార్డుకు సంబంధించి ‘గోప్యత’పై సుప్రీం కోర్టులో బుధవారం (జూలై-26) విచారణ కొనసాగింది. వేణుగోపాల్‌ తన వాదనను వినిపిస్తూ ఆర్టికల్‌ 21 కింద పేర్కొన్న హక్కులు సంపూర్ణమైనవి కాదన్నారు. గోప్యత ప్రాథమిక హక్కని మనం పేర్కొంటున్నా.. కేసును బట్టి అది మారుతుందని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జగదీష్‌ సింగ్‌ ఖేహార్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్‌కు సంబంధించిన ‘గోప్యత’పై విచారణ జరుపుతుంది.

ఆధార్‌ పేరుతో ఇచ్చే 12 అంకెల బయోమెట్రిక్‌ యునిక్‌ గుర్తింపు నెంబరు వ్యక్తిగత గోప్యతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ పలువురు పిటిషనర్లు ఈ నెల 20న తమ తరుపు వాదనను ధర్మాసనానికి వినిపించారు. వివిధ ప్రాథమిక హక్కులు వ్యక్తిగతమైనవి, విభిన్నమైనవని, వ్యక్తి స్వేచ్చకు సంబంధించిన మౌలిక అంశాలు ఆర్టికల్‌ 19లో ఉన్నాయని పిటిషనర్ల తరుపు న్యాయవాది గోపాల్‌ సుబ్రమణ్యమ్‌ తమ వాదన వినిపించారు. మానవ జీవితంలోని అన్ని ప్రక్రియలలో గోప్యత పొందపరచబడి ఉందని ఆయన వాదించారు.

గోప్యత అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, పుదుచ్చేరీ రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌లు వేశాయి. ఈ నాలుగు రాష్ట్రాల తరపున సీనియర్‌ అడ్వకేట్‌, మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో గోప్యత హక్కును, ప్రస్తుత కాలంలో దాని స్వభావాన్ని సుప్రీంకోర్టు తాజాగా పరిశీలించాల్సి ఉందన్నారు. ‘గోప్యత’ సంపూర్ణమైన హక్కు కాదు కాని.. ప్రాథమిక హక్కు అని చెబుతూ రెండింటి మధ్య కోర్టు సమతుల్యతను పాటించాల్సిన అవసరముందని ధర్మాసనానికి సిబల్‌ సూచించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy