ఎవరీ ఆశారాం : గుర్రపు బండి నడిపే వ్యక్తి దేవుడు ఎలా అయ్యాడు?

asaram-jatkaఆశారాం బాపూ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయన భక్తులు అక్షరాల 4 కోట్ల మంది. ఎక్కడికి వెళ్లినా ఆయన్ను దేవుడు వచ్చాడు అంటారు. పేరుతో పిలవరు భక్తులు. దేవుడిగానే కొలుస్తారు ఆశారాంని. దీని వెనక పెద్ద కథ ఉంది. ఆశారాం బాపు అసలు పేరు అసుమల్ హర్పలాని. ఈయనది పాకిస్తాన్. 1941లో పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రం బెర్నాయి గ్రామంలో పుట్టాడు. దేశ విభజన సమయంలో ఆశారాం కుటుంబం గుజరాత్ లోని అహ్మదాబాద్ వలస వచ్చింది. ఆ సమయంలో తిండికి కూడా ఇబ్బంది పడేవారు. ఆశారాం తండ్రి గుర్రపు బండి నడుపుతూ జీవనం సాగించేవాడు. తండ్రి తర్వాత కొన్నాళ్లు అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ నుంచి పట్టణంలోకి గుర్రపు బండి తోలుతూ జీవనం సాగించాడు. ఇదే సమయంలో ఓ ఆధ్యాత్మిక గురువు పరిచయం అయ్యాడు. ఆయనే అసుమల్ హర్పలాని పేరును ఆశారాం బాపుగా మార్చాడు.

24 ఏళ్ల వయస్సులో పూర్తిగా ఆధ్యాత్మికంలోకి వెళ్లాడు. గురువుల దగ్గర శిష్యరికం చేశాడు. అలా ప్రజలకు పరిచయం అయ్యాడు. 1972లో మొదటిసారి గుజరాత్ రాష్ట్రం మొతేరా టౌన్ లో సబర్మతి నదీ తీరంలో ఆశారాం పేరుతో ఆశ్రమాన్ని ప్రారంభించాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. మొదట్లో పదుల సంఖ్యలో ఉన్న భక్తులు.. క్రమంగా నాలుగు కోట్ల మందికి చేరారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన గాడ్ మెన్ గా మారాడు. ఇవాల్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలా సందర్భాల్లో ఆశారాం బాపు ఆశ్రమంలో ఆయన ప్రసంగాలను ఆలకించిన వారిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఈయన శిష్యులు కూడా. రాజకీయ నేతలతో సంబంధాలతో ఆశారాం ఆశ్రమాలు గుజరాత్ నుంచి హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరించాయి. లక్షల కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారు. ఇదే సమయంలో అవినీతి, భూకబ్జాలు, ఫోర్జరీలపై అనేక ఆరోపణలు, కేసులు నమోదు అయ్యాయి. వాటిపై విచారణ కూడా జరుగుతుంది.

వీటన్నింటిలో 2012లో జరిగిన ఘటన ఆయన జీవితాన్ని పతనానికి చేర్చింది. సూరత్ కు చెందిన 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం కేసు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే 2013లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జోథ్ పూర్ జైలులో ఉంటున్నారు. ఇప్పటికే 12 సార్లు వేసిన బెయిల్ పిటీషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. ఏప్రిల్ 25వ తేదీ బుధవారం ఈ కేసులో ఆశారాంని దోషిగా తేల్చింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy