ఎవరీ కొత్త ఎన్టీఆర్…? వర్మ ఇంట్రస్టింగ్ ఆన్సర్

రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తి పెంచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎవరు చేస్తున్నారు.. ఎలా ఉంటాడు అన్న క్యూరియాసిటీకి ఎండ్ కార్డ్ వేశాడు వర్మ. శుక్రవారం షెడ్యూల్ సమయానికి ఆలస్యంగా… సోషల్ మీడియాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. ‘ఎన్టీఆర్ బికమ్స్ అలైవ్ ఇన్ లక్ష్మీస్ ఎన్టీఆర్’ ‘టైటిల్ తో వర్మ పోస్ట్ చేసిన ఈ వీడియో… ఇపుడు వైరల్ గా మారింది. కొన్ని గంటల్లోనే ఈ వీడియోను పది లక్షల మంది(1 మిలియన్)కి పైగా వ్యూస్ వచ్చాయి.

తన సినిమాపై జనంలో చాలా ఆసక్తి ఉందన్నాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు వచ్చిన వ్యూస్, లైక్స్ ల స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడు. స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు ఆశీస్సులు మా సినిమాకే ఉన్నాయని చెప్పేందుకు ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదన్నాడు రాము.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన నటుడు గురించి బయట చాలా చర్చ జరుగుతోందని చెప్పిన వర్మ.. ఆ వివరాలను పోస్ట్ చేశాడు. పశ్చిమగోదావరి జిల్లాలో నాటకాలు వేస్తుండే నటుడిలో తాను ఎన్టీఆర్ ను చూశానని చెప్పాడు. అతడిని ఎన్టీఆర్ లా మార్చేందుకు చాలా కసరత్తు చేశానన్నాడు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఎన్టీఆర్ వైఖరి, ఎన్టీఆర్ మాటతీరు అతడికి రావడం కోసం… కొన్ని నెలలుగా ట్రైనింగ్ ఇచ్చాననీ చెప్పాడు వర్మ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy