ఎవరీ రషీద్ : ఆఘ్గన్ కుర్రోడు.. హైదరాబాద్ మెచ్చినోడు.. పెద్ద మనస్సున్నోడు

rashid-khanరషీద్ ఖాన్.. రషీద్ ఖాన్.. రషీద్ ఖాన్.. IPL 11 సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు. ఆఘ్గనిస్తాన్ కుర్రోడు అయినా.. హైదరాబాద్ ను ఫైనల్ కు చేర్చటంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఫీజు కాకుండా అద్భుతమైన ఫెర్మార్మెన్స్ తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నికై.. తనకు వచ్చిన డబ్బును మిత్రులకు, ఆఘ్గన్ లో బాంబు పేలుళ్లలో గాయపడిన వారికి విరాళంగా ఇచ్చి చిన్న వయస్సులో ఇంత పెద్ద మనస్సు ఉన్నోడిగా అందరి మన్ననలు పొందుతున్నాడు. అందుకే రషీద్ అంటే ఇప్పుడు అందరూ వాహ్ వా అని కీర్తిస్తున్నారు.

ఐపీఎల్ 11 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. స్పిన్నర్. ఈ సీజన్ లో మొత్తం 16 మ్యాచ్ లు ఆడి.. 384 బాల్స్ వేసి.. 434 రన్స్ ఇచ్చి.. 21 వికెట్లు తీసి టాప్ 2లో నిలిచాడు. రషీద్ బౌలింగ్ వల్లే సన్ రైజర్స్ ఫైనల్ కు వెళ్లింది. సెమీఫైనల్ లాంటి కీలకమైన మ్యాచ్ లో కోల్ కతాను కట్టడి చేశాడు. షారూఖ్ ఖాన్ టీంని ఇంటికి పంపించాడు. సన్ రైజర్స్ ను ఫైనల్ కు చేర్చాడు. ఇది కేవలం గ్రౌండ్ లో తన సత్తా.

రషీద్.. క్రికెటర్ గానే కాకుండా పెద్ద మనస్సున్నోడుగా కూడా అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ గెలిచి.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ సమయంలో వచ్చిన డబ్బును బాంబు దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడు, అతడి కుమారుడికి ఖర్చు నిమిత్తం అందజేశాడు. ఒక్క పైసా నాకు వద్దని గ్రౌండ్ సాక్షిగా ప్రకటించి.. తన గొప్ప మనస్సు చాటుకున్నాడు. అంతేనా.. సెమీఫైనల్ మ్యాచ్ లో కోల్ కతాపై గెలిచి.. మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక అయిన తర్వాత.. రూ.5లక్షల నగదు బహుమతి వచ్చింది. ఈ మొత్తాన్ని కూడా విరాళంగా ఇచ్చాడు రషీద్. ఆఘ్గన్ లోని జలాలాబాద్ క్రికెట్ గ్రౌండ్ లో బాంబు పేలింది. ఆరుగురు చనిపోతే.. చాలా మంది గాయపడ్డారు. ఆ బాధితులకు ఈ రూ.5 లక్షలు విరాళంగా అందించాడు. దీంతో సోషల్ మీడియాలో ఐపీఎల్ హీరో అయిపోయాడు రషీద్ ఖాన్. మనస్సున్న క్రికెటర్ గా మన్ననలు పొందుతున్నాడు..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy