ఎవరీ స్టీఫెన్ హాకింగ్.. సాధించిన అద్భుతాలు ఏంటీ

stephen-hawking-historyమోడ్రన్ సైన్స్ కి తండ్రిగా ఉన్న గెలీలియో గెలీలి మరణించిన.. 300 సంవత్సరాలకి స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. హాకింగ్ సైన్స్ మాత్రమే డెస్టీనీగా నమ్మారు. దురదృష్టం వల్ల చిన్న వయస్సులోనే హాకింగ్ మోటర్ న్యూరాన్ వ్యాధికి గురయ్యాడు. దీంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. అంతటి జబ్బు వచ్చినా.. మనో ధైర్యంతో ఇన్ని సంవత్సరాలు బతికాడు హాకింగ్.

 

 

… కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో గా గ్రాడ్యుయేట్ గా ఉన్న సమయంలో తన అక్క స్నేహితురాలు జానీ విల్డ్ తో హాకింగ్ రిలేఫన్ షిప్ లో ఉన్నారు. 1965 జులై 14 లో హాకింగ్ – జానీ విల్డ్ వివాహం జరిగింది.

… స్టీఫెన్ హాకింగ్ పబ్లిష్ చేసిన పుస్తకాల్లో ది బెస్ట్ గా నిలిచినవి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, బ్లాక్ హోల్స్, బేబీ యూనివర్సస్, ద యూనివర్స్ ఇన్ ఎ నెట్ షెల్, ది గ్రాండ్ డిజైన్, మై బ్రీఫ్ హిస్టరీ. అతడిని బెస్ట్ సెల్లర్ గా నిలబెట్టాయి.

… భౌతికశాస్త్రంలో మోస్ట్ బ్రిలియంట్ థిరిటికల్ సైంటిస్ట్ గా హాకింగ్ పేరుపొందారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు చేశారు. కంప్యూటర్ సహాయంతోనే సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటారు హాకింగ్.

… 1970 నుంచి బ్లాక్ హోల్స్ పై చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా కూడా సేవలందించారు.

… 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన హాకింగ్.. బ్లాక్ హోల్స్ కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. అప్పటి వరకు బ్లాక్ హోల్స్ కు శక్తి ఉంటుందని.. విశ్వంలో రేడియేషన్ ఉందని ప్రపంచానికి వెల్లడించారు.

….2007 ఏప్రిల్ లో  మార్చిన జెట్ లో జీరో గ్రావిటీలో అమెరికాలోని ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రం మీదుగా మొదటిసారి 24 వేల అడుగుల ఎత్తులో తన నర్సులు, ఫిజీఫియన్ల సాయంతో హాకింగ్ ప్రయాణించారు.

… 1988లో ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో హాకింగ్ బ్లాక్ హోల్స్ పుస్తకం వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులో అనువాదం అయ్యింది.

… ఈ రోజు(మార్చి14) ఉదయం కేంబ్రిడ్జ్ లోని తన నివాసంలో హాకింగ్ మరణించాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy