ఎవరూ నమ్మొద్దు : ఆ భూకంపం వార్త పచ్చి అబద్ధం

nasaదేశ రాజధాని ఢిల్లీలో ఏ చిన్న సంఘటన జరిగినా అది దేశం మొత్తంపై ప్రభావం చూపుతుంది. ఢిల్లీలో భారీ భూకంపం వస్తుందని.. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 9.1గా నమోదు కానుందని వాట్సప్ మెసేజ్ రాజధానిలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయని కొద్ది రోజులుగా వార్తలు రావడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఏప్రిల్ 7 నుంచి 15వ తేదీ మధ్య ఆ భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ మెసేజ్‌ సారాంశం. ప్రాణ నష్టం లక్షల్లో ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. గురుగ్రామ్ కేంద్రంగా భూకంపం వస్తుందని కూడా డిసైడ్ చేసేశారు. భారతదేశంలోని రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌, తమిళనాడు, బీహార్‌ రాష్ట్రాలు భూకంప ప్రభావానికి గురికానున్నాయనేది ఆ మెసేజ్ లో ఉంది.

అయితే ఆ మెసేజ్ పచ్చి అబద్ధం అని నిర్ధారించారు నాసా. అలాంటి వార్నింగ్‌ ఇవ్వలేదని ప్రకటించింది. ఫేక్ నాసా సైట్ నుంచి ఆ మెసేజ్ వచ్చినట్లు తేల్చారు. వచ్చిన మెసేజ్ లో చాలా స్పెల్లింగ్‌ మిస్టెక్‌లు ఉన్నాయని.. భూకంపాలను ముందుగా గుర్తించడం సాధ్యం కాదని తెలిపింది నాసా. స్పేస్‌ ఏజెన్సీ నుంచి వచ్చిన అధికారిక సమాచారం కాదని తేలడంతో ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ భూకంపం వార్తను ఎవరూ నమ్మొద్దని.. అలాంటి తప్పుడు వార్తలను ఎవరికీ పంపొద్దని కూడా సూచించింది నాసా.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy