ఎవరైనా సీఎం కావచ్చు…!

images (3)తమ పార్టీ ఎమ్మెల్యేలకు జేడీయూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎన్నికల్లో గెలిస్తే ఎవరైనా సీఎం కావచ్చని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే సీఎం పదవి చేపట్టే అవకాశం ఎవరికైనా రావోచ్చని తెలిపింది. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ మాట్లాడుతూ తాజాగా జీతన్ రామ్ మంజీకి అవకాశం వచ్చినట్లే మిగతా ఎమ్మెల్యేలకు కూడా సీఎం అయ్యే ఛాన్స్ వస్తుందని ఆఫర్ ఇచ్చారు.

ఎన్నికల్లోపు ప్రస్తుత సీఎం మంజీని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. 2015 ఎన్నికల్లో జేడీయూని అధికారంలోకి తీసుకోచ్చేందుకు నితీష్ సహాకారం ఉంటోందన్నారు. ఇక ప్రతిపక్ష నేత నందకిషోర్ యాదవ్ పై విమర్శలు చేస్తూ ప్రస్తుత సీఎం మంజీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నరేంద్ర సింగ్. మంజీతో సహా మిగతా మిగతా నేతలంతా పార్టీని అధికారంలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy