ఎస్సీ,ఎస్టీల జనాభా లెక్క తేలింది

MONEYజిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీల లెక్కలను తేల్చేశారు అధికారులు. ఉప ప్రణాళిక చట్టాన్ని సవరించే క్రమంలో జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఇప్పటికే నిర్ణయించింది. బడ్జెట్‌ సమావేశాల్లోపు చట్ట సవరణలు, కొత్త పథకాలపై నివేదికలు ఇచ్చేందుకు కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలను సేకరించాయి.

2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో పది జిల్లాలకు సంబంధించి గణాంకాలు సిద్ధంగా ఉండగా.. కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు కావడంతో ఆ మేరకు జనాభా లెక్కలను తేల్చేందుకు  రెడీ అయ్యారు అధికారులు.మండలాలు, రెవెన్యూ డివిజన్లవారీగా ఎస్సీ, ఎస్టీ జనసంఖ్యను నిర్ధారించారు. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో జనాభా 3,50,03,674. వీరిలో ఎస్సీలు 54,08,800, ఎస్టీలు 31,77,940 మంది. మొత్తం జనాభా లో ఎస్సీలు 15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారు. ఈ లెక్కల ఆధారంగానే ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద జిల్లాలవారీగా ఖర్చు చేయాలని భావిస్తున్నారు.

ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖలు తేల్చిన గణాంకాల ప్రకారం ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మంచిర్యాల జిల్లాకు అధిక నిధులు రానున్నాయి. ఈ జిల్లా సాధారణ జనాభాలో ఎస్సీలు 24.72 శాతం ఉన్నారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ (21.32 శాతం), జనగామ(21.15 శాతం), ఖమ్మం (19.93శాతం) జిల్లాలకు అధిక నిధులు అందనున్నాయి. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌ జిల్లాల్లో ఎస్సీ జనాభా తక్కువగా ఉంది. ఎస్టీ కేటగిరీలో మహబూబాబాద్‌ జిల్లాకు అధిక నిధులు కేటాయించనున్నారు. ఈ జిల్లాలో సగటు జనాభాలో 37.8శాతం గిరిజనులున్నారు. ఆ తర్వాత భద్రాద్రి– కొత్తగుడెం జిల్లా (36.66 శాతం), ఆదిలాబాద్‌ (31.68శాతం) జిల్లాలున్నాయి. హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అతి తక్కువ సంఖ్యలో గిరిజనులున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy