ఎస్సై రాసిన ఆ లేఖ

kmnr siపెద్దపల్లి ఎస్సై ఆత్మహత్య  కరీంనగర్ జిల్లా  పోలీస్ డిపార్ట్ మెంట్ లో  కలకలం రేపుతోంది. నిన్న రాత్రి  పోలీస్ క్వార్టర్ లో తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని  ఆత్మహత్య  చేసుకున్నాడు ఎస్సై జగన్మోహన్. తన చావుకు ఎవరూ  కారణం కాదనీ… తన సోదరుడు  ఏసీబీకి దొరికిపోవడంతో మనస్తాపానికి  లోనైనట్టు  సూసైడ్ నోట్ రాశాడు. SIలు, స్టేషన్ హౌస్  ఆఫీసర్లపై  వర్క్ బర్డెన్ ఎక్కువవుతోందని  లెటర్ లో రాసిన  కామెంట్లు.. డిపార్ట్ మెంట్లో హాట్ టాపిక్ అయ్యాయి.

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్సైగా పనిచేస్తూ సూసైడ్ చేసుకున్న SI జగన్ మోహన్.. అంత్యక్రియలు ముగిశాయి. పంచనామా ముగిసిన తర్వాత కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం దగ్గరలో.. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. డీఐజీ మల్లారెడ్డి, ఎస్సీ జోయల్ డెవిస్ హాజరయ్యారు. బంధువులు, మిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. సూసైడ్ నోట్ ఆధారంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు డీఐజీ. బదిలీ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో లేదన్నారు.

SI SUSIDE LETTER (1)తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాశారు జగన్మోహన్. ధర్మపురిలో తన కస్టడీలో ఒక వ్యక్తి చనిపోయినపుడే.. సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యానని రాశారు. ఎస్ఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లపై పనిభారం ఎక్కువౌతోందని.. గమనించాలని ఉన్నతాధికారులను కోరాడు. మిత్రులు, బంధువులు ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ప్రస్తావించిన జగన్.. అంతా బాగుండాలని ఆకాంక్షించారు.

2007లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, నర్సాపూర్ లో, కరీంనగర్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పని చేశారు. 2015 జనవరిలో పెద్దపల్లి SI గా బాధ్యతలు తీసుకున్నారు. డ్యూటీలో సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా పేరుతెచ్చుకున్నారు. రీసెంట్ గా జరిగిన ట్రాన్స్ ఫర్లలో.. పెద్దపల్లి నుంచి జమ్మికుంటకు బదిలీ అయ్యారు.

 

 

 

 

SI SUSIDE LETTER (2)

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy