ఏంటీ ఉద్యమం.. ఎందుకు : నాట్ ఇన్ మై నేమ్

not-in-my-nameదేశంలో దళితులు, మైనారిటీలు,  అమాయకులపై మతం, సంస్కృతి,  ఆవు పేరుతో జరుగుతున్న దాడులకు  నిరసనగా  మౌనదీక్ష. దేశంలో నిత్యం అనేక చోట్ల.. నాట్  ఇన్ మై  నేమ్  అనే నినాదంతో నిరసనలు. నినాదాలు లేవు, ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు.. అంతా నిశ్చబ్దం. ఓ ప్లేకార్డ్ పై NOT IN MY NAME అనే అక్షరాలు మాత్రమే ఉంటాయి. సోషల్ మీడియాలో పుట్టిన స్లోగన్.. ఇప్పుడు రోడ్డెక్కింది. అయినా సరే విధ్వంసాలు లేవు.. గొడవలు లేవు.. ఘర్షణలు లేవు. రోడ్డెక్కిన జనం కూడా కేవలం ప్లేకార్డ్ తోనే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క స్లోగన్ ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. ప్రతి గుండెను ఆలోచింపజేస్తోంది.

ఎందుకీ ఉద్యమం :

దేశంలో అసహనం, విద్వేష దాడులు జరుగుతున్నాయి. మతం వల్లకావొచ్చు.. అది తిండి విషయంలో కావొచ్చు.. ఎక్కడో ఓచోట బాధితులు ఉంటూనే ఉన్నారు. దీనికి నిరసనగానే మానవతావాదులు దేశంలో నిశ్శబ్ద ఆందోళనకు నడుంబిగించారు. సోషల్ మీడియాలో పుట్టిన ఈ నినాదం.. ఇప్పుడు హోరెత్తుతోంది. మానవతావాదులు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు.. నాట్ ఇన్ మై నేమ్ (NOT IN MY NAME) అనే స్లోగన్ తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టేజ్ లు లేవు, స్పీచ్ లు ఉండవు. అంతా నిశ్శబ్దం. నాట్ ఇన్ మై నేమ్ అని రాసిన ప్లకార్డు పట్టుకుని అలా నిలుచుంటారు.

NOT IN MY NAME అంటే ఏంటీ :

నాట్ ఇన్ మై నేమ్ అంటే.. నాపై ఈరోజు దాడి జరగకపోవచ్చు.. ఏదో ఒక రోజు.. ఏదో ఒక కారణంతో నాపై దాడి జరగొచ్చు. ఇప్పుడు నేను వ్యతిరేకించకపోతే.. రేపు నా వంతు కూడా రావచ్చు. అందుకే ఈ మౌన నిరసన అని అర్థం. వర్గం, మతం, వర్ణం అంటే ద్వేషం పెంచుకున్నవాళ్లే దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారనేది మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్న మాట. వాళ్లను బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారనేది వారి వాదన. మౌనంగా ఉండటం కూడా రెచ్చగొట్టడమే అంటున్నారు వారు.

రాజకీయ పార్టీల మద్దతు :

ఎవరూ ఎవర్నీ పిలవలేదు. ఎవరికీ ఆహ్వానాలు లేవు. అయినా సరే NOT IN MY NAME ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాయి పార్టీలు. సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా మానవతావాదులతో కలిసి నడుస్తున్నారు. సోషల్ మీడియాలో పుట్టిన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ వరకు విస్తరించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy