ఏంటీ నిజమే : రూ.500కే జియో 4G ఫోన్

jio-phoneజియో రాకతో ఎంత సంచలన అయ్యిందో.. అదే తరహాలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది రిలయన్స్. దేశంలోనే అత్యంత చౌక ధరలో ఫీచర్ ఫోన్ లాంఛ చేయబోతున్నది. ఈ నెలాఖరులోగానే విడుదల కానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈనెల 21వ తేదీ రిలయన్స్ వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ సమావేశంలోనే అంబానీ గ్రాండ్ గా ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. రూ.500 ధరలో ఈ ఫీచర్ ఫోన్.. 4G నెట్ వర్క్ (VOLTE) పనిచేస్తోంది. మార్కెట్ లో 4G నెట్ వర్క్ లో పని చేసే ఫోన్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఈ కారణంగానూ జియో కస్టమర్లు భారీగా పడిపోయారు. దీన్ని అధిగమించేందుకు 4G VOLTE హ్యండ్ సెట్లను విడుదల చేస్తోంది రిలయన్స్. జియో 4G VOLTE హ్యాండెసెట్లను అత్యంత చౌకగా.. కేవలం రూ.500కే అందించాలని నిర్ణయించింది. జియో 4జీ ఫోన్లతో గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లు భారీ సంఖ్యలో పెరగనున్నట్లు అంచనా వేస్తుంది. జియో 4G VOLTE ఫోన్లతో రెండు కోట్ల మంది కస్టమర్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది కంపెనీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy