ఏంటీ పిచ్చి అభిమానం : సల్మాన్ ఖాన్ నా భర్త అంటూ యువతి హల్ చల్

sfgఅభిమానం హద్దులు దాటి వారి అభిమాన హీరోలకి తలనొప్పి పుట్టిస్తుంది. దేశవ్యాప్తంగా సల్మాన్ ఖాన్(52) కు కోట్లాది మంది అభిమానులున్నారు. అయితే అభిమానం హద్దులు దాటి, పిచ్చిగా అభిమానించిన ఓ యువతి చేసిన పని సల్మాన్ ఖాన్ కు తలనొప్పి పుట్టించింది. స‌ల్మాన్ కు వీరాభిమాని అయిన ఓ యువ‌తి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ నివ‌సించే ఇంటి పైకి ఎక్కి స‌ల్మాన్ నా భ‌ర్త అంటూ పెద్గగా కేక‌లు వేయడంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది ఆమెని అక్క‌డినుండే పంపించే ప్ర‌య‌త్నం చేసారు. అయితే ఆ యువ‌తి చేతిలో ఇనుప‌రాడ్లు ప‌ట్టుకొని ద‌గ్గ‌రకి వ‌స్తే చ‌చ్చిపోతానంటూ బెదిరించడంతో ఎవరూ కూడా ఆమె దగ్గరకు వెళ్ళేందుకు సాహ‌సించ‌లేదు. అగ్నిమాప‌క సిబ్బందికి  స‌మాచారం అందించ‌డంతో వెంట‌నే వారు అక్క‌డికి చేరుకొని ఆ యువ‌తిని బిల్డింగ్ పై నుండి కింద‌కి దింపే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం సల్మాన్ అబుదాబిలో రేస్ 3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  గతంలో కూడా ఈ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కి ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే ఎదుర‌య్యాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy