ఏఐబీ వివాదంలో కరణ్ జోహర్ కు సమన్లు

karan johar2013లో టెలీకాస్టైన వివాదాస్పద టివీ షో ఏఐబి నాక్ అవుట్ వివాదం కరణ్ జోహర్ ను ఇప్పటికీ వెంటాడుతోంది.  కరణ్ జోహార్ కు సమన్లు జారీ చేశారు ముంబై పోలీసులు. ఈ షోలో పాల్గొన్న బాలీవుడ్ టాప్ స్టార్స్ అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల కు కూడా సమన్లు జారీ చేసే అవకాశముంది. ముఖ్యంగా షోలో అర్జున్ కపూర్, రణవీర్ సింగ్ ల బిహేవియర్ తో పాటు కరణ్ జోహార్ చేసిన కొన్ని కామెంట్స్  సంచలనం సృష్టించాయి. ఈ షోపై సామాజిక కార్యకర్త సంతోష్ దౌండకర్  2014 ఫిబ్రవరిలో సిటీ కోర్టులో కేసు వేశారు. ఆ కార్యక్రమాన్ని పరిశీలించిన కోర్టు అందులో పాల్గొన్న వ్యక్తుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందింగా పోలీసులను ఆదేశించింది. దీంతో ఏఐబి షోలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ పై కూడా కేసు నమెదైంది. కరణ్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయటం కోసం ఆయన్ను టార్డియో పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సింది సమన్లు పంపించారు. ప్రస్తుతం ఓ సెలెబ్రిటి షో కోసం లండన్ లో ఉన్న కరణ్ ఈ విషయం పై స్పందించడానికి నిరాకరించినట్టుగా సమాచారం. కరణ్ జోహార్ తో పాటు అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకోణె పై ఐపిసి సెక్షన్ 295 కింద కేసు నమోదు చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy