‘ఏక్ దిన్ కా సుల్తాన్’ ఎవరు?

రాష్ట్రంలో ఎలక్షన్లు మూడు నెలల్లో జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిపోయిందువల్ల ఈ మూడునెలలకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అనుకున్నారు. అయితే, ఒక్కసారైనా సరే,  ‘చీఫ్ మినిస్టర్’ అనిపించుకోవాలనే తాపత్రయంలో కొంతమంది ప్రయత్నాలు చేసుకుంటుండడంతో, రాష్ట్రపతి పాలన విషయంలో డౌట్స్ వస్తున్నాయి. అలాగే, కొన్ని టెక్నికల్ పాయింట్ల కారణంగా కూడా రాష్ట్రపతి పాలనకు అవకాశాలు తక్కువగా కనిపిస్తుండడంతో ‘ఏక్ దిన్ సుల్తాన్’ లాంటి ముఖ్యమంత్రి పోస్టు కోసం డిమాండ్ పెరిగింది.

ఢిల్లీలో మకాం వేసి సీఎం పోస్టు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నవారిలో సీమాంధ్రనుంచి కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ, చిరంజీవి ఉన్నారు. తెలంగాణనుంచి దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, డీ శ్రీనివాస్, జానారెడ్డి కూడా పోటీలో ఉన్నారు.

వచ్చే ఎలక్షన్లను ద్రుష్టిలో ఉంచుకుని కాపు కులం ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ కనుక కాపు కులంవారికి చాన్సిస్తే చిరంజీవికి కానీ, బొత్సకు కానీ, కన్నాకు కానీ పోస్టు దక్కుతుంది.

ఈ కొద్ది కాలానికి కూడా సీఎం పోస్టు సీమాంధ్రకు ఇవ్వడమేంటని తెలంగాణవాళ్ళు నిలదీయకుండా తెలంగాణవారికే ఈ పోస్టు ఇవ్వొచ్చు. ఇలా నిర్ణయిస్తే, తెలంగాణనుంచి బీసీనో, ఎస్సీనో సీఎం చేసే అవకాశముంది. ఎస్సీ కోటాలో అయితే తనకే చాన్సివ్వాలని, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న తనను ప్రమోట్ చేసినట్టు కూడా అవుతుందని దామోదర హై కమాండ్ పెద్దలతో చెప్తున్నారు. సోనియాను కూడా కలిసి ఇదే మాట చెప్పారు దామోదర.

బీసీలకు కనుక ఇవ్వాలనుకుంటే, కాంగ్రెస్ పార్టీకి మొదటినుంచీ విధేయుడిగా ఉన్న డీ శ్రీనివాస్ కు పదవి దక్కొచ్చు. డీఎస్ కాంట్రవర్షియల్ కాదు కూడా. మరో బీసీ నాయకుడు పొన్నాల కూడా సీఎం పోస్టు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. డీఎస్, పొన్నాల….ఇద్దరూ మున్నూరుకాపు కులస్తులే. వీరిలో ఎవరికి పోస్టు ఇచ్చినా కోస్తాలో కాపు కులస్తులు కూడా సంతోషిస్తారని కొంతమంది అంటున్నారు.

మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న తెలంగాణ రెడ్లకు బహుమతిగా జానారెడ్డికి సీఎం పదవి ఇవ్వొచ్చునని కూడా కొంతమంది అంచనా. జానారెడ్డి కూడా కాంట్రవర్షియల్ మనిషి కాదు,

మొత్తానికి, ఎవ్వరూ ఊహించని విధంగా ‘ ఏక్ దిన్ కా సుల్తాన్’  సీఎం పోస్టు కోసం తీవ్రమైన పోటీ ఏర్పడింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy