ఏటా కేసీఆర్ క్రికెట్ కప్: ఎంపీ కవిత

kcr-cricketప్రతి ఏటా కేసీఆర్‌ క్రికెట్‌ కప్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఆటగాళ్లను ప్రోత్సహించడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌లో మే 24 నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుంది. నాగారం రాజారాం గ్రౌండ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి చెందిన జట్లే కాకుండా.. ఇతర రాష్ట్రాల జట్లు కూడా పాల్గొనడం ఈ సారి టోర్నీ ప్రత్యేకత.

ఈ క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ట్రోఫీతో పాటు రూ. 3 లక్షల నగదు అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 1.5 లక్షల ప్రోత్సాహక బహుమతి ఉంటుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy