ఏటీఎం దొంగ దొరికాడు !

hyderabad_woman_attacked_in_atm_crouched_650_635678229852841159హైదరాబాద్ యూసఫ్ గూడాలోని ఒక ఏటీఎంలో ఒక అమ్మాయిని గన్ తో బెదిరించి ఫైర్ చేసి, భయపెట్టిన దొంగ దొరికాడు. అమ్మాయి నగలు, డబ్బు దోచుకున్న ఈ దొంగను 24 గంటలలోపే పట్టుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొరికాడు దొంగ. జల్సాలకు అలవాటుపడి దొంగగా మారిన ఈ దొంగనుంచి పిస్టళ్ళు, ఏటీఎం కార్డులు, డబ్బు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగ పేరు శివకుమార్ రెడ్డి అని సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. శివకుమార్ రెడ్డి ది కడప జిల్లా.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy