సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర్రావు ఇకలేరు

edidaప్రముఖ నిర్మాత, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వర్రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సపొందుతూ సాయంత్రం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. 1934లో తూర్పుగోదావరి జిల్లాలో పుట్టారు. ఏడిద నాగేశ్వర్రావు భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 8లోని ఆయన స్వగృహానికి తరలించారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  కళాత్మక సినిమాలకు పెట్టింది పేరు నాగేశ్వర్రావు. శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషి లాంటి క్లాసిక్స్ ను టాలీవుడ్ కు అందించారు. ఈయన సినిమాలు తెలుగు చిత్రసీమకు అఖండఖ్యాతిని తెచ్చిపెట్టాయి. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమాలు ప్రదర్శితమయ్యాయి. నంది అవార్డులతో పాటు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాయి. రష్యన్ లాంగ్వేజ్ లోకి కూడా అనువాదమయ్యాయి. ఆయన నిర్మించిన చిత్రాలు…

  • సిరిసిరిమువ్వ(1978)
  • తాయారమ్మ – బంగారమ్మ(1979)
  • శంకరాభరణం(1979)
  • సీతాకోకచిలుక(1981)
  • సాగర సంగమం(1983)
  • సితారా(1984)
  • స్వాతిముత్యం(1986)
  • స్వయంకృషి(1987)
  • స్వరకల్పన(1989)
  • ఆపద్బాంధవుడు(1992)

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy