ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు

tsrtcప్రతి యేటా ప్రతిష్టాత్మకంగా జరిగే ఏడుపాయల జాతర రేపటి నుంచి 27వ తేదీవరకు జరగుతుంది. జాతరకు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతా జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి ఏడుపాయల జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మెదక్ రీజియన్ నుంచి 140 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, నర్సాపూర్, జోగిపేట, బాలనగర్, జేబీఎస్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రజల సురిక్షిత ప్రయాణం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఏమైనా సందేహాలు ఉంటే మెదక్ డీపో మేనేజర్ 9959226268, సంగారెడ్డి డీపో మేనేజర్ 9959226267, జహీరాబాద్ డీపో మేనేజర్ 9959226269, నారాయణఖేడ్ డీపో మేనేజర్ 9959223170 నెంబర్లకు సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. 

ఎక్కడి నుండి        ఎక్కడి వరకు         పెద్దలు        పిల్లలు

 

సంగారెడ్డి             ఘనాపూర్            60            30

సదాశివపేట         ఘనాపూర్            80            40

జోగిపేట              ఘనాపూర్             30             15

నర్సాపూర్           ఘనాపూర్             35             20

నారాయణఖేడ్     ఏడుపాయల         60             30

బొడ్మట్ పల్లి       ఏడుపాయల           40             20

మెదక్               ఏడుపాయల           20              10

జేబీఎస్             ఏడుపాయల           105              55

జహీరాబాద్       ఏడుపాయల           155             80

బాలానగర్         ఘనాపూర్               75              40       

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy