ఏడు మండలాల విలీనం పై పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ఏపీలో విలీనమైన తెలంగాణలోని 7 మండలాల నియోజకవర్గాలను పునర్విభజన చేయాలంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషన్ ను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. ఆ నియోజకవర్గాలను పునర్విభజన చేశాకే తెలంగాణలో ఎన్నికలు జరపాలని  మర్రి శశిధర్ రెడ్డి ఆ పిటిషన్ లో కోరారు. దీని పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పిచ్చింది.

ఇక ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయంటూ ఆయన వేసిన పిటిషన్‌ మరో పిటిషన్ పై హైకోర్టు విచారణను ముగించింది.  ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్ అయినందున ఈ అంశం తమ పరిధిలో లేదని స్పష్టం చేసింది.ఈ విషయంలో అభ్యంతరాలుంటే సంబంధిత ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని  తెలిపింది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy