ఏడేళ్ల చిన్నారి.. గూగుల్ ఉద్యోగం అడిగింది!

google-childక్లో బ్రిడ్జ్ వాట‌ర్ అనే ఏడేళ్ల బాలిక త‌న‌కు గూగుల్‌లో ఉద్యోగం కావాలంటూ ఏకంగా ఆ సంస్థ సీఈఓ సుంద‌ర్ పిచ్చాయ్‌కే లేఖ రాసింది. ఆ చిన్నారి నుంచి లేఖ అందుకున్న పిచాయ్ ఎంతో మురిసిపోయాడు. యూకేకు చెందిన క్లో బ్రిడ్జ్‌వాట‌ర్ కు రోబోలన్నా, టెక్నాల‌జీకి సంబంధించి ఈ అంశ‌మైనా చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ ఇష్ట‌మే త‌న‌కు గూగుల్‌లో ఉద్యోగం కావాలంటూ  సుంద‌ర్ పిచాయ్‌కు లేఖ రాసేలా ప్రేరేపించింది.

ఇదీ లేఖ సారాంశం:

డియ‌ర్ గూగుల్ బాస్ అంటూ లేఖ‌ను మొద‌లు పెట్టిన క్లో బ్రిడ్జ్ వాట‌ర్ త‌న‌కు కంప్యూట‌ర్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ని త‌న‌కు గూగుల్‌లో ఓ ఉద్యోగం ఇవ్వాల‌ని కోరింది. త‌న క్లాసులో ఎప్పుడూ త‌నే ఫ‌స్ట్ అని చెప్పుకొచ్చింది. త‌న తండ్రి కంప్యూట‌ర్ కొనిస్తాడ‌ని మాట ఇచ్చిన‌ట్లు క్లో సుంద‌ర్ పిచాయ్‌కు తెలిపింది. ఇప్ప‌టికే కొన్ని కంప్యూట‌ర్ గేమ్స్‌పై ప‌ట్టు సాధించిన‌ట్లు లేఖ‌లో వెల్ల‌డించింది. త‌ను చ‌దువులో చుర‌గ్గా ఉంటాన‌ని చెప్పిన చిన్నారి…త‌న టీచ‌ర్లు మెచ్చుకుంటార‌ని చెప్పింది. ఇదే ఆత్మ‌విశ్వాసంతో ఏదో ఒక‌రోజు గూగుల్‌లో ఉద్యోగం సంపాదిస్తాన‌ని లేఖ‌లో పేర్కొంది. గూగుల్‌లో ఉద్యోగం సంపాదించ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాద‌ని త‌న తండ్రి చెప్ప‌డంతో గూగుల్ బాస్‌కు లేఖ రాస్తున్న‌ట్లు చిన్నారి చెప్పింది.

లేఖ చ‌దివిన సుంద‌ర్ పిచాయ్ చిన్నారి కోరిక‌కు మురిసిపోయాడు. వెంట‌నే గూగుల్‌బాస్ కూడా రిప్లై ఇచ్చారు. ముందు బాగా చ‌దివి టెక్నిక‌ల్ స్కిల్స్ డెవ‌ల‌ప్ చేసుకోవాల‌ని.. ఆ త‌ర్వాత‌ గూగుల్‌లో ఉద్యోగం రెడీగా ఉంటుంద‌ని పిచాయ్ చెప్ప‌డంతో ఆ చిన్నారిలో మ‌రింత ఉత్సాహం కనిపించింది.

2 Responses to ఏడేళ్ల చిన్నారి.. గూగుల్ ఉద్యోగం అడిగింది!

  1. Hi friends.
    Thanks for sharing valuable information about Google.thisnews was intresting evryone want to do job with Google.Pichai is honest person given good and valuable reply to girl .this incident made eveyone google is ready to take any skilled person in coming days.

  2. Anonymous says:

    Pichai sir.has given a beautiful answer. And that girl. What a brave heart.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy